#Top Stories

Vietnam TRUONG MY LAN : Female billionaire sentenced to death : వియత్నాంలో మహిళా బిలియనీర్‌కు మరణశిక్ష.. 

వియత్నాం రియల్ ఎస్టేట్ టైకూన్, బిలియనీర్ ట్రూంగ్ మై లాన్‌కు మరణశిక్ష పడింది. ఆ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో దోషిగా తేలడంతో ఆమెకు మరణశిక్ష విధిస్తూ హోచిమిన్ నగరంలోని ఓ కోర్టు గురువారం తీర్పునిచ్చిందని స్థానిక మీడియా చెబుతోంది. ‘వాన్ థిన్ ఫాట్ హోల్డింగ్స్ గ్రూప్’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉన్న 67 ఏళ్ల ట్రూంగ్ మైలాన్.. తన నియంత్రణలోనే ఉన్న ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌’లో మోసానికి పాల్పడ్డారు.

వియత్నాం రియల్ ఎస్టేట్ టైకూన్, బిలియనీర్ ట్రూంగ్ మై లాన్‌కు (Truong My Lan) మరణశిక్ష పడింది. ఆ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో దోషిగా తేలడంతో ఆమెకు మరణశిక్ష విధిస్తూ హోచిమిన్ నగరంలోని ఓ కోర్టు గురువారం తీర్పునిచ్చిందని స్థానిక మీడియా చెబుతోంది. ‘వాన్ థిన్ ఫాట్ హోల్డింగ్స్ గ్రూప్’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉన్న 67 ఏళ్ల ట్రూంగ్ మైలాన్.. తన నియంత్రణలోనే ఉన్న ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌’లో మోసానికి పాల్పడ్డారు. ఏకంగా 12.5 బిలియన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1 లక్ష కోట్లు) దారి మళ్లీ మళ్లించారు. 2022లో వియత్నాం జీడీపీలో దాదాపు 3 శాతంగా ఈ మొత్తాన్ని తన షెల్ కంపెనీకి బదిలీ చేశారు.

2012 నుంచి 2022 మధ్యకాలంలో ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌’ను ట్రూంగ్ మై లాన్ చట్టవిరుద్ధంగా నియంత్రించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆమె ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చి వేలాది ఫేక్ కంపెనీలకు దాదాపు 304 ట్రిలియన్ డాంగ్ (12.5 బిలియన్ డాలర్లు) మళ్లించారు. అయితే వియత్నాంలో 2022 నుంచి అవినీతి నిరోధక చర్యలు తీవ్రమవ్వగా అదే ఏడాది అక్టోబర్‌లో ట్రూంగ్ లాన్ వ్యవహారం బయటకొచ్చింది.

మరోవైపు నష్టాల్లో ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌’ నష్టాల్లో ఉందని చెప్పడంతో 2018 ప్రారంభం నుంచి అక్టోబరు 2022 వరకు వియత్నాం ప్రభుత్వం ఈ బ్యాంకుకు ఉద్దీపన ప్యాకేజీలు ఇస్తూ వచ్చింది. కానీ ట్రూంగ్ లాన్ మాత్రం నిధులను దారి మళ్లిస్తూ వచ్చారు. తన షెల్ కంపెనీలకు చట్టవిరుద్ధంగా రుణాలను చేరవేశారు. కాగా ఈ తీర్పును సవాలు అప్పీలు చేయబోతున్నట్టు ట్రూంగ్ లాన్ న్యాయవాది ఒకరు తెలిపారు

ట్రూంగ్ మై లాన్ ఎవరు?

ట్రూంగ్ మై లాన్ హోచిమిన్ సిటీలోని ఒక సైనో-వియత్నామీస్ కుటుంబానికి చెందినవారు. తల్లితో కలిసి సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తులను విక్రయించే మార్కెట్ స్టాల్ విక్రేతగా ఆమె కెరియర్‌ను ప్రారంభించారు. అయితే 1986లో అక్కడి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ‘డోయి మోయి’ అని పిలిచే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన నాటి నుంచి ఆమె భూమి, ఆస్తుల కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆమె సంపద గణనీయంగా పెరిగింది. 1990 దశకంలో ఆమె హోటళ్లు, రెస్టారెంట్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసింది. ఇక 2011 నాటికి ఆమె హోచి మిన్ నగరంలో ప్రసిద్ధ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇక నగదు కొరతలో ఉన్న మూడు బ్యాంకులను విలీనం చేసి ఒక పెద్ద సంస్థ ‘సైగాన్ కమర్షియల్ బ్యాంక్‌’గా ఏర్పాటు చేయడానికి ఆమెకు అనుమతి దక్కింది. ఒక వ్యక్తికి 5 శాతానికి మించి వాటా ఉండకూడదనే నిబంధన ఉన్నప్పటికీ… అక్రమ మార్గాల్లో తన మనుషుల ద్వారా ఏకంగా 90 శాతం బ్యాంక్ షేర్లను ట్రూంగ్ లాన్ నియంత్రించారు.

Vietnam TRUONG MY LAN : Female billionaire sentenced to death : వియత్నాంలో మహిళా బిలియనీర్‌కు మరణశిక్ష.. 

Kavitha Liqour Case : CBI produced Kavitha

Leave a comment

Your email address will not be published. Required fields are marked *