#Top Stories

USA: The threat of tornadoes in America : అమెరికాలో టోర్నడోల బీభత్సం…..

అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటి ధాటికి ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

వ్యాలీ వ్యూ (టెక్సాస్‌): అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటి ధాటికి ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో ఓక్లహామా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో బీభత్సానికి ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చెట్లు, విద్యుత్తు లైన్లు కూలిపోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని కుక్‌ కౌంటీ పోలీసు అధికారి తెలిపారు. ఆర్కన్సాస్‌లో తుపాను తీవ్రతకు 26 ఏళ్ల మహిళ సహా ఇద్దరు మరణించారు. ఓక్లహామాలోని మేయస్‌ కౌంటీలో రెండు మరణాలు సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర డాలస్‌లో టోర్నడో ధాటికి పలు చోట్ల భారీ వాహనాలు బోల్తాపడ్డాయి.

USA: The threat of tornadoes in America : అమెరికాలో టోర్నడోల బీభత్సం…..

Ajith – Nayanthara as a couple again

Leave a comment

Your email address will not be published. Required fields are marked *