#Top Stories

USA : America’s warning to Indian students!భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక.!అనుమాన మృతి, అదృశ్యం ఘటనలు..

అమెరికాలో ఇటీవల భారతీయ, భారత మూలాలున్న విద్యార్ధుల మరణాలు, అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) స్పందించారు. ఈ సందర్భంగా భారత విద్యార్ధులకు కొన్ని సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది.

అమెరికాలో ఇటీవల భారతీయ, భారత మూలాలున్న విద్యార్ధుల మరణాలు, అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) స్పందించారు. ఈ సందర్భంగా భారత విద్యార్ధులకు కొన్ని సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది. అందులో.. ఇటీవల కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర పరిస్థితుల గురించి విన్నాను. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియో రికార్డు చేశాను. ఈ పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. చట్టానికి లోబడి ఉండండి. రాత్రి పూట చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకండి. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి. దయచేసి అతిగా మద్యం సేవించకండి. ఇవన్నీ విపత్తుకు దారితీసే అంశాలు. కుటుంబాలకు దూరంగా అమెరికాకు వచ్చిన కొత్తల్లో స్నేహితులు, కొత్త అలవాట్ల వంటివాటిపై జాగ్రత్తగా ఉండండి అంటూ సూచించారు.

అంతేకాదు, భారతీయ విద్యార్థులు కఠోర శ్రమ, విజయానికి చిరునామాలని, అయితే అదేసమయంలో కొందరు ఫెంటానెల్‌ వంటి డ్రగ్స్‌కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. అవి ప్రాణాంతకమని, మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు కెరీర్‌ అవకాశాలను దెబ్బతీస్తాయన్నారు. అలాగే అమెరికాకు వచ్చే విద్యార్ధులు తమ వీసా స్టేటస్‌ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని, పార్ట్‌టైం ఉద్యోగం విషయంలో దానికున్న చట్టబద్ధతను అర్థం చేసుకోవాలని సూచించారు. అమెరికాలో విదేశీ విద్యార్థిగా మీకున్న హద్దులు తప్పక తెలుసుకోవాలంటూ ఇంద్రానూయీ సూచించారు. విద్యాసంస్థల పట్ల అవగాహనతో ఉండాలని, స్కామ్‌లు, సోషల్‌ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *