#Top Stories

 Trump Hush Money Trial Case: హుష్ మనీ ట్రయల్‌ కేసులో డోనాల్డ్ ట్రంప్‌ దోషి..! 

మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (77)కు పెద్ద షాక్ తగిలింది. శుక్రవారం (మే 31, 2024), అతను హుష్ మనీ ట్రయల్‌కు సంబంధించిన మొత్తం 34 కౌంట్‌లలో దోషిగా నిర్ధారించింది కోర్టు. హుష్ మనీ క్రిమినల్ ట్రయల్‌లో వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించిన మొత్తం 34 అభియోగాలు నిజమేనని డొనాల్డ్ ట్రంప్‌ను మాన్హాటన్ జ్యూరీ దోషిగా నిర్ధారించింది.

అడల్ట్ ఫిలిం స్టార్‌ కేసులో 77 ఏళ్ల ట్రంప్‌ దోషిగా తేలడం ఆయనకు ఇబ్బందికర అంశమే. స్టార్మీ​తో సంబంధం బయటపడకుండా డబ్బులతో సెటిల్ చేసుకున్న ట్రంప్‌.. అలా ఆమెకు చెల్లించిన సొమ్మును బిజినెస్‌ డీల్‌లో భాగంగా చూపించారు. ట్రంప్ నుంచి ఆమెకు లక్షా 30 వేల డాలర్లు అందాయి. ఈ సెటిల్‌మెంట్‌ను బిజినెస్‌ డీల్‌ కింద చూపించినట్టు ఇప్పుడు రుజువైంది.

2006 జులైలో స్మార్టీని ట్రంప్ కలిసింది. అప్పుడు ఓ గోల్ఫ్ టోర్నమెంట్‌‌లో అడల్ట్ ఫిలిం స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌తో కలిసారు. తర్వాత ఆ వ్యవహారం బయటకు రావడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ ట్రై చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2016 ఎన్నికల టైమ్‌లో స్మార్టీ ఈ విషయాన్ని ప్రస్తావించకుండా చూసేందుకు డబ్బులు ఇచ్చారని కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోనే ఇప్పుడు ట్రంప్​‌ను దోషిగా తేల్చింది 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ.

డొనాల్డ్ ట్రంప్ దోషిగా నిర్ధారించడం చారిత్రాత్మక నిర్ణయం, దేశ చరిత్రలో నేరానికి పాల్పడిన మొదటి మాజీ అధ్యక్షుడు ట్రంప్. అయితే, జ్యూరీ నిర్ణయం అవమానకరమైనది అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. నవంబరు 5, 2024న జరిగే అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అసలు నిర్ణయం వస్తుందని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన ప్రత్యర్థిని బ్యాలెట్ బాక్స్ వద్ద మాత్రమే ఓడించగలరని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే మాన్‌హాటన్​లోని కోర్టు నిర్ణయం వ్యక్తిగతంగా ట్రంప్‌ ఇమేజ్‌కు డ్యామేజ్ చేసేదే అయినా.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది లేదు. అయితే ఇది ఎన్నికలలో అతని విశ్వసనీయతను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో కాలమే చెబుతుంది..!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *