SS. Rajamouli: Rajamouli was in a hotel in Japan when there was an earthquake పెను ప్రమాదం నుంచి బయటపడిన రాజమౌళి.. ఆందోళనలో ఫ్యాన్స్.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమ స్క్రీనింగ్ కోసం ఇటీవల కుటుంబంతో సహా జపాన్ వెళ్లారు రాజమౌళి. జపాన్ లో ఓ హోటల్‌లో 28వ ప్లోర్‌లో రాజమౌళి ఫ్యామిలీ బసచేశారట. అయితే జపాన్ లో ఒక్కసారిగా భూకంపం ఏర్పడిందట. సడెన్‌గా భూకంపం రావడంతో అందరూ భయపడిపోయారట. భయంతో వణికిపోయారట. ఈ విషయాన్ని కార్తికేయ తెలిపారు.
దర్శక ధీరుడు రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమ స్క్రీనింగ్ కోసం ఇటీవల కుటుంబంతో సహా జపాన్ వెళ్లారు రాజమౌళి. జపాన్ లో ఓ హోటల్‌లో 28వ ప్లోర్‌లో రాజమౌళి ఫ్యామిలీ బసచేశారట. అయితే జపాన్ లో ఒక్కసారిగా భూకంపం ఏర్పడిందట. సడెన్‌గా భూకంపం రావడంతో అందరూ భయపడిపోయారట. కుటుంబసభ్యులంతా భయంతో వణికిపోయారట. ఈ విషయాన్ని కార్తికేయ తెలిపారు.
జపాన్ లో భూకంపం వచ్చిందని తామంతా భయపడిపోయామని రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ తన సోషల్ మీడియాలో తెలిపాడు. తన ఫ్యామిలి అంతా జపాన్‌లో ఓ భారీ బిల్డింగ్లో 28వ ఫ్లోర్ లో ఉన్నామని.. సడన్ గా బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించింది సోషల్ మీడియాలో తెలిపాడు కార్తికేయ.దాంతో రాజమౌళి అభిమానులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఆయన క్షేమంగా ఇండియా తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. అలాగే విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా జపాన్ లో ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.. అంతే కాదు ఎన్నో ప్రతిశాత్మక అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్ సినిమా. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.