#Top Stories

Prime Minister Modi released the BJP pamphlet. బీజేపీ కరపత్రాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ..

గత 10 ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం విడుదల చేసింది కమలం పార్టీ. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజ్‎నాథ్‎సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అందులో ముఖ్యమైన అంశాలను చాలా ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ కమలం కరపత్రం అనేక చర్చలకు దారి తీస్తోంది. గత పదేళ్లలో చేసిన సంక్షేమంతో పాటు అభివృద్దిని కూడా ప్రస్తావించారు.

గత 10 ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం విడుదల చేసింది కమలం పార్టీ. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజ్‎నాథ్‎సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అందులో ముఖ్యమైన అంశాలను చాలా ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ కమలం కరపత్రం అనేక చర్చలకు దారి తీస్తోంది. గత పదేళ్లలో చేసిన సంక్షేమంతో పాటు అభివృద్దిని కూడా ప్రస్తావించారు. 25 కోట్ల భారతీయులను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుచేసి జమ్మూ కాశ్మీర్లో శాంతిని నెలకొల్పామని తెలిపారు. అయోధ్యలో శ్రీ బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్టను చేసినట్లు వివరించారు.

చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన మొట్టమొదటి దేశంగా భారత్ కీర్తిని కొనియాడారు. ఈ ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పారు. సౌభాగ్య యోజన కింద 100% ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించామన్నారు. 4 కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 11.8 కోట్ల గృహాలకు జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షిత తాగు నీటి నల్లా కనెక్షన్లు ఇప్పించామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పిఎం కిసాన్ సమృద్ధి యోజన ద్వారా 11 కోట్ల పైగా రైతులకు ఏడాదికి రూ. 6 వేలు ఆర్థిక సహాయం అందజేసినట్లు చెప్పారు.

పీఎం ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 37 కోట్ల లబ్ధిదారులకు ఆరోగ్య బీమా కల్పంచామన్నారు. పీఎం స్వనిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు చేయూత కల్పించినట్లు తెలిపారు. జన్ ధన్ ఖాతాల ద్వారా 51 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో మెట్రో సేవల విస్తరణ పనులు చేపట్టామన్నారు. 2014 లో 74 విమానాశ్రయాల సంఖ్యను నేడు 149కు తీసుకెళ్లామన్నారు. 100 పైగా స్మార్ట్ సిటీస్ లో 7,800 ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. 80 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తెచ్చాం. 2047 నాటికి 4,500 అందుబాటులోకి తేవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. 40,000 సాధారణ రైల్ కోచ్ లను వందే భారత్ స్థాయికి అప్‎గ్రేడ్ చేశామన్నారు.

Prime Minister Modi released the BJP pamphlet. బీజేపీ కరపత్రాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ..

Salman khan : Gunshots at salman home

Leave a comment

Your email address will not be published. Required fields are marked *