#Top Stories

PAKISTAN : BLA attack on Pakistan Naval Air Station పాక్‌ నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బీఎల్‌ఏ దాడి

పాకిస్తాన్‌లోని రెండవ అతిపెద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) దాడికి తెగబడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడింది. 

బలూచిస్థాన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం బీఎల్‌ఏ ఫైటర్లు టర్బాట్‌లో ఉన్న పీఎన్‌ఎస్‌ సిద్ధిఖీ నేవల్ బేస్‌లోకి ప్రవేశించి అక్కడ పలు ప్రదేశాలలో పేలుళ్లకు పాల్పడ్డారు. నేవీ బేస్ దగ్గర అర్థరాత్రి వేళ షెల్లింగ్ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పీఎన్‌ఎస్‌ అనేది పాక్‌లోని రెండవ అతిపెద్ద నేవీ స్థావరం. పాకిస్తాన్ నేవీకి చెందిన ఆధునిక ఆయుధాలు ఇక్కడ నిల్వ చేస్తారు. 

సోమవారం రాత్రి దాడి ప్రారంభంకాగా ఇప్పటికీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని సమాచారం. అయితే ఈ దాడిని తాము భగ్నం చేశామని పాక్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ  ఉదంతంపై పాక్‌ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే టర్బాట్‌లోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించారు.  వైద్యులను అప్రమత్తం చేశారు. దీనికి ముందు జనవరి 29న గ్వాదర్‌లోని పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి జరిగింది. కాగా తాజాగా టర్బాట్‌లో సోమవారం రాత్రి ప్రారంభమైన దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.


 

PAKISTAN : BLA attack on Pakistan Naval Air Station పాక్‌ నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బీఎల్‌ఏ దాడి

AAP protest : Increased security at Prime

Leave a comment

Your email address will not be published. Required fields are marked *