#Top Stories

Moscow Concert Attack:  Terror attack in Russia మాస్కోలో ఉగ్ర దాడి.. 133కి పెరిగిన మృతుల సంఖ్య.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్..

మాస్కో ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు. దాడి వెనుక ఉక్రెయిన్‌ హస్తముందన్నారు. దాడికి సంబంధించి రష్యాను నెలరోజుల క్రితమే హెచ్చరించినట్టు అమెరికా తెలిపింది. రష్యా రాజధాని మాస్కోలోని ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కన్సర్ట్ హాల్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 133 మంది మరణించారు. మరికొంత మంది ప్రాణాలతో పోరాడుతున్నట్లు రష్యా ప్రభుత్వం వెల్లడించింది.

రష్యా రాజధాని మాస్కోలోని ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కన్సర్ట్ హాల్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 133 మంది మరణించారు. మరికొంత మంది ప్రాణాలతో పోరాడుతున్నట్లు రష్యా ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. ఉగ్రదాడితో సంబంధం ఉన్న 11 మందిని అరెస్ట్‌ చేయగా.. వారిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దులో ఈ నలుగురిని అరెస్ట్‌ చేశారు. దాడికి తామే పాల్పడినట్టు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈనెల 22న రాత్రి ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్ ఫిక్‌నిక్‌ సంగీత విభావరి జరుగుతున్న క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. తొలుత కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన దుండగులు అక్కడున్నవారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. మ్యూజిక్‌ షో ముగియడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అంతేకాకుండా బాంబులు కూడా విసిరారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో ఏమో తెలియక జనం సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హాలులో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మాస్కోలో ఉగ్రదాడిపై అమెరికా స్పందించింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు తెలిపింది. కాన్సర్ట్‌లు, ప్రజలు ఎక్కువగా గుడిగూడే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు వెల్లడించింది. ఈ సమాచారాన్ని వాషింగ్టన్‌ వెంటనే రష్యా అధికారులకు అందించినట్లు తెలిపారు. ఏదైనా నిఘా సమాచారం అందిన వెంటనే అమెరికా ఆయా దేశాలను అలర్ట్‌ చేస్తుంది. ఉగ్రదాడిలో ఉక్రెనియన్ల పాత్ర ఉన్నట్లు రష్యా ఆరోపించింది.

దాడికి సంబంధించి ముందే హెచ్చరించామని చెప్పిన అమెరికా.. అందులో ఉక్రేనియన్ల పాత్రకు సంబంధించిన విషయాన్ని దాచిపెడుతున్నదని ఆరోపించింది. ఈ దాడిని భారత్‌తో పాటు ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిపై స్పందించిన ప్రధాని మోదీ రష్యాకు అండగా ఉంటామని ప్రకటించారు.

ఉగ్రదాడితో ఒక్కసారిగా రష్యాలో అలజడి రేగింది. మాస్కోలో ఉగ్రదాడిపై పుతిన్‌ కీలక ప్రకటన చేశారు. ఘటన వెనుక ఎవరున్నా భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు పుతిన్‌. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *