#Top Stories

MLC’s Kavitha in Delhi Tihar Jail ఢిల్లీ తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత.. అమెకు కల్పించే సౌకర్యాలివే..

ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆమెకు రిమాండ్ గడువు పొడిగిస్తూ ఢిల్లీ అవెన్యూ కోర్టు అదేశించింది. దీంతో ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. మొదటి రోజు తీహార్ జైలులో కవిత జైలు భోజనం చేశారని అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి.

ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆమెకు రిమాండ్ గడువు పొడిగిస్తూ ఢిల్లీ అవెన్యూ కోర్టు అదేశించింది. దీంతో ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. మొదటి రోజు తీహార్ జైలులో కవిత జైలు భోజనం చేశారని అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి. తీహార్ జైలు నుండి వచ్చిన సమాచారం ప్రకారం, కవిత మొదటి రోజు రాత్రి ఒక ప్రత్యేక మహిళా జైలులోని 6 నంబర్ సెల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు మరో ఇద్దరు మహిళా ఖైదీలు కూడా ఉన్నట్లు సమాచారం. కవిత తొలి రోజు జైలులో పప్పు అన్నం తిన్నారని తెలిపారు జైలు అధికారులు. ఇదే భోజనాన్ని మంగళవారం రాత్రి ఇతర ఖైదీలకు కూడా వడ్డించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం స్నాక్స్‌తో టీ తాగినట్లు జైలు వర్గాలు తెలిపాయి. అంటే జైలులో శిక్ష అనుభవిస్తున్న తోటి ఖైదీలు ఏమి తింటున్నారో అదే ఆహారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రభావవంతమైన కేసు కనుక కవితను విడుదల చేస్తే,  సాక్షులను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ తన వాదలల్లో కోర్టుకు తెలిపింది. అందుకే బెయిల్ ఇవ్వొద్దని ఈడీ అధికారుల తరఫు న్యాయవాది విజ్ఞప్తిపై ఢిల్లీ కోర్టు ఆమెను ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. దీంతో మంగళవారం సాయంత్రం కవితను తీహార్ జైలుకు తరలించారు.

ముందుగా ఆమెకు వైద్య పరీక్షలు చేసి ఆమెను నేరుగా సెల్‌కి తీసుకెళ్లారు. మెడికల్ చెకప్ సమయంలో కవిత కొద్దిగా బీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అది సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలిపారు జైలు అధికారులు. తిహార్ జైలు నిబంధనల ప్రకారం కవితకు ఒక పరుపు, చెప్పులు, బట్టలు, బెడ్‌షీట్, దుప్పటి ఇచ్చారని తెలుస్తోంది. దీంతో పాటు ఆమెకు మందులు కూడా అందించినట్లు సమాచారం. తనకు ఫలానా వస్తువులు కావాలని ఎలాంటి డిమాండ్ చేయలేదని పేర్కొన్నారు జైలు అధికారులు. కోర్టు ఆదేశాలు, జైలు నిబంధనల ప్రకారం ఆమెకు అవసరమైన వస్తువులను అందజేస్తామని ఒక అధికారి తెలిపారు. కోర్టు ఆదేశం ప్రకారం, కవితకు ఇంట్లో వండిన ఆహారం, ఒక పరుపు, చెప్పులు, బట్టలు, ఒక బెడ్‌షీట్, ఒక దుప్పటి, పుస్తకాలు, పెన్, కాగితం, మందులు అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు. పైన పేర్కొన్న వాటికి మాత్రమే కోర్టు అనుమతి ఉందని స్పష్టం చేశారు. కవిత జైలులోకి వెళ్లేటప్పుడు ఎలాంటి ఆభరణాలు ధరించడానికి అనుమతి ఉండదు. ఈ క్రమంలోనే ఆమె జైలుకు వచ్చినప్పుడు ఎలాంటి నగలు తన దేహంపై ధరించలేదని అధికారి తెలిపారు. కవిత ఉన్న తీహార్ జైలులో లైబ్రరీ ఉంది. అందులో పుస్తకాలను చదివేందుకు అనుమతి ఉంటుంది.

తీహార్ జైలు కాంప్లెక్స్‌లోని ఆరో నంబర్ జైలులో దాదాపు 500 మంది మహిళా ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న రాజకీయ నాయకుల్లో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కవిత ఉన్నారు. సిసోడియా జైలు నంబర్ 1లో ఉండగా, సింగ్ జైలు నంబర్ 2లో ఉన్నారు. ఇదే మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన మరో నేత సత్యేందర్ జైన్ జైలు నంబర్ 7లో ఉన్నారు.

MLC’s Kavitha  in Delhi Tihar Jail ఢిల్లీ తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత.. అమెకు కల్పించే సౌకర్యాలివే..

Free for women in the bus.. Tickets

Leave a comment

Your email address will not be published. Required fields are marked *