MLC Kavitha: Hearing on Kavitha’s petition today in the Supreme CourtMLC Kavitha: నేడు కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

MLC Kavitha Case Updates In Liquor Scam..
►తన అరెస్ట్ అక్రమం అంటూ పిటిషన్ దాఖలు చేసిన కవిత.
►తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని సీజేఐకి విజ్ఞప్తి చేసిన కవిత.
►కవిత పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తారా? లేదా? అనే అంశంపై కొనసాగతున్న సస్పెన్స్.
►కవిత పిటిషన్‌పై విచారణ 11 గంటలకు వాయిదా. అడిషనల్ సొలిసిటర్ జనరల్ లేకపోవడంతో విచారణ వాయిదా.
►కవితపై పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం.
►ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలంటూ, అంత వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దు అంటూ దాఖలైన పిటిషన్ ఉపసంహరించుకున్న కవిత తరపు న్యాయవాది.
►పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం.
►కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ విక్రమ్ చౌదరి.
►ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కవిత ప్రస్తుతం ఏడు రోజులు ఈడీ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ కేసు సంబంధించి ఈడీ ఆమెను ప్రశ్నిస్తోంది.
కవితకు లేఖ రాసిన సుఖేష్..
- ఎమ్మెల్సీ కవితకు మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
- తీహార్ జైల్ క్లబ్‌లో త్వరలో మీరు సభ్యులు కాబోతున్నారు
- తీహార్ జైల్ కౌంట్‌డౌన్ మీకు ప్రారంభమైంది
- అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారు
- సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సొమ్ము బయటపడుతుంది
- వాట్సాప్ సంభాషణలపై దర్యాప్తు జరుగుతోంది
- అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా
- కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు
- ఈ కేసులో కావాల్సినన్ని సాక్షాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు
- తీహార్ క్లబ్‌లో స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తుంటాను.
►నేడు కవితపై ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈడీ సమన్లను కవిత సవాల్ చేసింది. కవిత పిటిషన్‌పై నేడు జస్టిస్ బేల త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
►మరోవైపు.. నేడు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ మూడో రోజు విచారించనుంది.
►గత రెండు రోజులుగా ములాఖత్‌లో కవితను కలుస్తున్న కేటీఆర్, హరీష్ రావు
►ఈ లిక్కర్ కేసులో ఇప్పటికే 128.79 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేసిన ఈడీ.
►కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రెస్ నోట్
►ఢిల్లీ లిక్కర్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు
►ఆస్తుల జప్తును ఆమోదించిన అడ్జుడికేటింగ్ అథారిటీ
►మద్యం విధానం రూపకల్పనలో కవిత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర చేశారు
►ఈ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అప్పజెప్పడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారు
►ఈ మొత్తాన్ని హోల్సేల్ వ్యాపారుల నుంచి ఇప్పించారు
►తిరిగి ఆ డబ్బును లాభాలను రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు పన్నారు
►ఈ కేసులో మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం
►245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాము
►ఒక ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఐదు సప్లిమెంటరీ కంప్లైంట్స్ ఫైల్ చేశాం
►కవిత ఏడు రోజుల ఈడి కస్టడీలో ఉంది
►ఆమెను అరెస్టు చేసే సమయంలో బంధువులు మాకు ఆటంకం కలిగించారు