LEBANON HEZBOLLAH ATTACK WITH 40 MISSILES ON ISRAEL : ఇజ్రాయెల్‌పై 40 క్షిపణులతో లెబనాన్ దాడి..అక్కడి భారతీయులకు సూచనలు

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్(Israel), హమాస్(hamas) మధ్య హింసాత్మక ఘర్షణ ఆరు నెలలకు పైగా కొనసాగింది. ఈ ఘటనలో ఇప్పటికే 33 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లెబనాన్‌కు(Lebanon) చెందిన హిజ్బుల్లా(Hezbollah) ఉత్తర ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది.

శ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్(hamas) మధ్య హింసాత్మక ఘర్షణ ఆరు నెలలకు పైగా కొనసాగింది. ఈ ఘటనలో ఇప్పటికే 33 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లెబనాన్‌కు(Lebanon) చెందిన హిజ్బుల్లా(Hezbollah) ఉత్తర ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది. అయితే లెబనాన్‌కు ఇరాన్ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ (IDF) శుక్రవారం అర్ధరాత్రి తర్వాత లెబనాన్ నుంచి ఉత్తర ఇజ్రాయెల్ వైపు సుమారు 40 రాకెట్లు ప్రయోగించబడ్డాయని వెల్లడించింది.

ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్(iran) రాయబార కార్యాలయంపై వైమానిక దాడి చేసింది. ఈ చర్యలో ఇరాన్‌కు చెందిన ఇద్దరు టాప్ జనరల్స్ మరణించారు. ఈ దాడితో ఆగ్రహించిన టెహ్రాన్ ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. శుక్రవారం-శనివారం మధ్య రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేయవచ్చని అమెరికన్(america) అధికారులు నివేదికలు కూడా ఇచ్చారు.
ఇరాన్ నుంచి దాడులు జరగనున్నాయన్న నేపథ్యంలోనే తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా(Hezbollah) ఇజ్రాయెల్‌పై 40కి పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను రక్షణ దళాలు విడుదల చేశాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని గలీలీలో జరిగిన దాడిలో, హిజ్బుల్లా రెండు డ్రోన్‌లను ఇజ్రాయెల్ సైన్యం కూల్చేసింది.