#Top Stories

Kerala Raging:  Raging c in the hostel..హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగింపు..

కేరళ ( Kerala ) లోని వాయనాడ్ జిల్లాలో హాస్టల్ వాష్‌రూమ్‌లో కాలేజీ విద్యార్థి మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 ఏళ్ల సిద్ధార్థన్ వెటర్నరీ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు.

కేరళ లోని వాయనాడ్ జిల్లాలో హాస్టల్ వాష్‌రూమ్‌లో కాలేజీ విద్యార్థి మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 ఏళ్ల సిద్ధార్థన్ వెటర్నరీ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. అతను సూసైడ్ చేసుకునే ముందు దాదాపు 29 గంటల పాటు చిత్రహింసలు అనుభవించాడని నివేదికలో వెల్లడించింది. ఆ వేధింపులు తాళలేక ఫిబ్రవరి 18న బాత్రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ర్యాగింగ్ తట్టుకోలేకే సిద్ధార్థన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు.

సిద్ధార్థన్ ను చాలా చిత్రహింసలకు గురిచేశారు. ఆహారం, నీళ్లు ఇవ్వకుండా ఆకలితో అలమటించాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వాపోయాడు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. సూసైడ్ ఘటనపై కాలేజీ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అప్రమత్తమైంది. మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై మధ్యంతర నివేదిక వెల్లడించింది. సిద్ధార్ధన్ డెడ్ బాడీపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ర్యాగింగ్ సమయంలో సిద్ధార్థన్ దుస్తులు, లోదుస్తులను కూడా తొలగించి నగ్నంగా ఊరేగించి, దారుణంగా కొట్టారని తెలిపింది.

ఫిబ్రవరి 16వ నుంచి ఫిబ్రవరి 17 వరకు సిద్ధార్థన్‌ను చేతులు, బెల్టులతో కొట్టారు. దీంతో తీవ్ర మానసి ఒత్తిడికి గురైన సిద్ధార్థన్ ఫిబ్రవరి 18న ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో 18 మందిని యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టింది. నలుగురు సభ్యుల సీబీఐ బృందం వాయనాడ్ కేరళ పోలీసు అధికారులతో సమావేశమైంది. మృతుడి కుటుంబసభ్యుల నుంచి పూర్తి వివరాలు రాబట్టనుంది.

Kerala Raging:  Raging c in the hostel..హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగింపు..

AI will impact all jobs : ఏఐ

Kerala Raging:  Raging c in the hostel..హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగింపు..

Trending News: Rats that ate 19 kg

Leave a comment

Your email address will not be published. Required fields are marked *