#Top Stories

Japan: Japan’s first private rocket exploded within moments of launch..!

జపాన్‌ ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్‌ ల్యాంచ్‌ప్యాడ్‌కు అత్యంత సమీపంలోనే పేలిపోయింది. దీంతో ప్రైవేటు రాకెట్‌ సాయంతో ఉపగ్రహాలను వేగంగా కక్ష్యలోకి చేర్చాలన్న లక్ష్యం తీరలేదు.  

జపాన్‌ (Japan) చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో చోటు చేసుకొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి ఎగిరింది. కానీ, కొన్ని క్షణాల్లోనే ఇది పేలుడుకు గురై గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది. దీని శకలాలు చూట్టూ ఉన్న పర్వత పాదాలపై పడ్డాయి. దీంతో తక్షణమే అక్కడ ఉన్న నీటి స్ప్రింక్లర్లు పనిచేయడం మొదలుపెట్టాయి. మరోవైపు  పేలుడు ఫలితంగా లాంచ్‌ ప్యాడ్‌ ఏరియా మొత్తం నల్లటి పొగ కమ్మేసింది. వాస్తవానికి ప్రయోగించిన 51 నిమిషాల్లోనే ఈ రాకెట్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చాల్సి ఉంది. 

టోక్యోకు చెందిన స్పేస్‌ వన్‌ సంస్థ ఈ రాకెట్‌ను నిర్మించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఆ దేశంలో శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు సంస్థగా ఇది రికార్డు సృష్టించేది. ఈ ప్రమాదంపై ఆ కంపెనీ స్పందిస్తూ  ‘‘కైరోస్‌ రాకెట్‌ లాంచింగ్‌ ప్రక్రియ సజావుగానే సాగింది. కానీ, ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేసేందుకు చర్యలు తీసుకొన్నాం’’ అని స్పేస్‌ వన్‌ పేర్కొంది. ఆ నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించిన జపాన్‌.. తాజా వైఫల్యంతో కొంత నిరాశ చెందింది. ప్రస్తుతం కక్ష్యలో ఉన్న నిఘా ఉపగ్రహాల్లో సమస్యలు తెలెత్తితే వెంటనో మరోదానిని నింగిలోకి పంపే ప్రక్రియను ఈ ప్రయోగంలో విశ్లేషించాలనుకొంది. 

రాకెట్‌ వైఫల్యాలు జపాన్‌కు కొత్తకాదు. గతేడాది ఎస్పోలాన్‌ ఎస్‌ రాకెట్‌ కూడా ప్రయోగించిన 50 సెకన్లలో పేలిపోయింది. మార్చిలో హెచ్‌3 రాకెట్‌ కూడా పేలిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ అదే శ్రేణి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. హెచ్‌3 స్పేసెక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌కు పోటీగా భావిస్తున్నారు. చంద్రుడిపైకి ఒక్కరోజులో వస్తువులను పంపించే సామర్థ్యం సంతరించుకొనేలా దీనిని నిర్మిస్తున్నారు.

Japan: Japan’s first private rocket exploded within moments of launch..!

Voice of protests against CAA

Japan: Japan’s first private rocket exploded within moments of launch..!

Astronauts returned from space

Leave a comment

Your email address will not be published. Required fields are marked *