#Top Stories

Israeli airstrikes on Gaza hospital : గాజా తాత్కాలిక ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి.

డెయిర్‌ అల్‌-బలా: మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. పాత్రికేయులతో సహా 15 మంది గాయపడ్డారు. యుద్ధ కల్లోలిత ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందతున్నారు. దాడితో మహిళలు, పిల్లలు చెల్లాచెదురై పెద్దపెట్టున రోదించారు. ఆసుపత్రి సేవలకు ఎలాంటి ఆటంకం కలగలేదని, ఇస్లామిక్‌ జిహాద్‌ ‘ఉగ్రవాదుల శిబిర కమాండ్‌ కేంద్రం’పైనే తాము దాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం స్పష్టంచేసింది. అక్కడ భారీగా ఆయుధాలను గుర్తించినట్లు తెలిపింది.

నెతన్యాహుకు శస్త్రచికిత్స: ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు ఆదివారం హెర్నియా శస్త్రచికిత్స నిర్వహించారు. మత్తు ఇచ్చి శస్త్రచికిత్స చేసిన సమయంలో ఉప ప్రధాని యారివ్‌ లెవిన్‌ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు

Israeli airstrikes on Gaza  hospital : గాజా తాత్కాలిక ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

Rishi Sunak : gets a shock in

Leave a comment

Your email address will not be published. Required fields are marked *