#Top Stories

immediate ceasefire in Gaza.. 14 countries voted in favor గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేయాలి.. 14 దేశాలు అనుకూలంగా ఓటు

హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న యుద్ధకాండను తక్షణం ఆపివేయాలని ఐక్యరాజ్యసమితి కోరింది. గాజాలో 5 నెలలుగా కొనసాగుతున్న కాల్పులకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తొలిసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను వ్యతిరేకించిన అమెరికా తాజా తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉంది. రంజాన్ మాసం సందర్భంగా తక్షణమే కాల్పులను విరమించుకోవాలని కోరిన ఈ తీర్మానంపై సోమవారం ఓటింగ్ జరిగింది.

హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న యుద్ధకాండను తక్షణం ఆపివేయాలని ఐక్యరాజ్యసమితి కోరింది. గాజాలో 5 నెలలుగా కొనసాగుతున్న కాల్పులకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తొలిసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను వ్యతిరేకించిన అమెరికా తాజా తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉంది. రంజాన్ మాసం సందర్భంగా తక్షణమే కాల్పులను విరమించుకోవాలని కోరిన ఈ తీర్మానంపై సోమవారం ఓటింగ్ జరిగింది. భద్రతా మండలిలో అమెరికా మినహా మిగతా 14 సభ్య దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. స్లోవేనియా, స్విట్జర్లాండ్‌తో పాటు భద్రతా మండలిలోని అరబ్ దేశాల కూటమి అల్జీరియా ద్వారా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. శాశ్వత కాల్పుల విరమణకు మార్గం చూపడంతో పాటు అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన అమాయక బందీలను కూడా వదిలిపెట్టాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *