Hyderabad Gun Misfire : గన్ మిస్‌ఫైర్.. ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ మృతి

హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనియాలం పీఎస్ పరిధిలోని కబూతర్ ఖానా వద్ద పోలీసు పికెట్ వద్ద ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ మృతి గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో గన్ నుంచి బుల్లెట్ శరీరంలోకి దూసుకుపోదవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో ఇదే పీకేట్లో మిస్ ఫైర్ అయ్యి ఒక కానిస్టేబుల్..
హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనియాలం పీఎస్ పరిధిలోని కబూతర్ ఖానా వద్ద పోలీసు పికెట్ వద్ద ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ మృతి గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో గన్ నుంచి బుల్లెట్ శరీరంలోకి దూసుకుపోదవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో ఇదే పీకేట్లో మిస్ ఫైర్ అయ్యి ఒక కానిస్టేబుల్ కూడా మృతి చెందాడు.

కాగా, ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తున గన్ మిస్‌ఫైర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సంఘటన స్థలంలోనే మృతి చెందారు. కానిస్టేబుల్ బాలేశ్వర్‌ను హుస్సేనియాలం పోలీసు స్టేషన్ పరిధిలోని కబుతర్ ఖానా పోలీసు అవుట్ పోస్ట్‌లో నియమించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.