HOLI DUABI : Holi celebrations at Srikrishna Temple in Dubai ! దుబాయ్ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు.
భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పలువురికి స్వీట్లు పంచి, హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.