#Top Stories

Gang of fake drugs!

దేశరాజధాని ఢిల్లీలో నకిలీ మందులను తయారు చేస్తున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 

నిందితులు రూ.1.96 లక్షల విలువైన క్యాన్సర్‌కు సంబంధించిన నకిలీ ఇంజెక్షన్లను విక్రయించారు. చైనా, అమెరికా తదితర దేశాలకు కూడా వీరు క్యాన్సర్‌  నకిలీ మందులను  పంపారు. నిందితుల వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన రూ.89 లక్షల నగదు, రూ.18 వేల డాలర్లు, ఏడు అంతర్జాతీయ, రెండు భారతీయ బ్రాండ్లకు చెందిన క్యాన్సర్ నకిలీ మందులను క్రైమ్ బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది. స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ షాలినీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం మూడు నెలల విచారణ  అనంతరం పోలీసుల దర్యాప్తు బృందం ఈ ముఠాను పట్టుకోగలిగింది. ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసుల బృందం ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు చేసింది. 

విఫిల్ జైన్ నకిలీ మందుల రాకెట్‌కు సూత్రధారిగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. ఇతనికి చెందిన ఇళ్ల నుంచి మూడు క్యాప్ సీలింగ్ మిషన్లు, ఒక హీట్ గన్ మెషీన్ మొదలైనవాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని క్యాన్సర్‌ ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు కోమల్‌ తివారీ, అభినయ్‌ కోహ్లీలను కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. 

Gang of fake drugs!

Astronauts returned from space

Leave a comment

Your email address will not be published. Required fields are marked *