#Top Stories

Earthquake in japan, thaiwan :  తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్‌ సహా మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ విపత్తులో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

తైపీ: భారీ భూకంపం తైవాన్‌ సహా జపాన్‌ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. తైవాన్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. ఆ దేశ ‘భూకంప పర్యవేక్షణ సంస్థ’ ప్రకంపనల తీవ్రతను రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా గుర్తించగా.. ‘అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS)’ దీన్ని 7.4గా పేర్కొంది. తైవాన్‌లోని హువాలియెన్‌ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరం, 35 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది.

భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌ పట్టణాన్ని తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక ఐదంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోవడం చిత్రాల్లో కనిపిస్తోంది. రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జపాన్‌లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఒకినావా ద్వీప సమూహంలో మూడు మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని జపాన్‌ హెచ్చరించింది. భూకంపం సంభవించిన 15 నిమిషాలకు భారీ అల యొనగుని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. మియాకో, యేయామా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. 1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని నిపుణులు చెబుతున్నారు.

Earthquake in japan, thaiwan :  తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్‌ సహా మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు

Israel: Ours is a Big mistake.. Accepted

Leave a comment

Your email address will not be published. Required fields are marked *