#Top Stories

DELHI : building collapsed.. Two dead, another in critical condition కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రెండు అంతస్తుల భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని కబీర్‌ నగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం గురువారం తెల్లవారు జామున 2.30గంటల సమయంలో కుప్పకూలిపోయింది. భవనం కూలిన సమయంలో అందులో కార్మికులు పనులు చేస్తున్నారు.

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రెండు అంతస్తుల భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని కబీర్‌ నగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం గురువారం తెల్లవారు జామున 2.30గంటల సమయంలో కుప్పకూలిపోయింది. భవనం కూలిన సమయంలో అందులో కార్మికులు పనులు చేస్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక జీటీబీ ఆస్పత్రికి తరలించారు. భవనం కూలిన సమయంలో అందులో 13మంది వరకు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న కూలీలను బయటకు తీశారు. భవన నిర్మాణంకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, భవనం కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

DELHI :  building collapsed.. Two dead, another in critical condition కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

PM Modi: Prime Minister Narendra Modi to

Leave a comment

Your email address will not be published. Required fields are marked *