#Top Stories

Congress Jana Jatara: తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ.. 

అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిచేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. మరి తుక్కుగూడ సభతో హిస్టరీ రిపీట్‌ అవుతుందా..? జనజాతర సభ మోత ఎలా ఉండబోతోంది..? అసలు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి..?

అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిచేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. మరి తుక్కుగూడ సభతో హిస్టరీ రిపీట్‌ అవుతుందా..? జనజాతర సభ మోత ఎలా ఉండబోతోంది..? అసలు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి..? ఒకసారి చూద్దాం..!

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు ఏఫ్రిల్ 6వ తేదీన హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరకానుండటంతో పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది అధికార కాంగ్రెస్‌.

తుక్కుగూడ‌లోని 60 ఎక‌రాల విశాల‌మైన మైదానంలో జ‌నజాత‌ర బ‌హిరంగ స‌భ‌ జరగనుంది. వాహ‌నాల పార్కింగ్‌కు సుమారు 300 ఎక‌రాల స్థలాన్ని కేటాయించారు. ఈ స‌భ‌కు ఆదిలాబాద్ మొద‌లు ఆలంపూర్ వ‌ర‌కు, జహీరాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు అన్నిగ్రామాలు, ప‌ట్టణాలు, న‌గ‌రాల నుంచి ప్రజ‌లను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. క‌నీసం ప‌ది ల‌క్షల మంది జ‌న‌జాత‌ర‌కు హాజ‌రవుతార‌ని కాంగ్రెస్ పార్టీ అంచ‌నా వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే స‌భ ప్రాంగ‌ణాన్ని సంద‌ర్శించి ఏర్పాట్లను ప‌రిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎంత పెద్ద మొత్తంలో ప్రజ‌లు త‌ర‌లివ‌చ్చినా ఎటువంటి లోటుపాట్లు జ‌రగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు.

మరోవైపు తుక్కుగూడను సెంటిమెంట్‌గా భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచే ఎన్నికల సమరాన్ని ప్రారంభించి విజయం సాధించడంతో.. ఇప్పుడు ఈ జనజాతర సభతో హిస్టరీ రిపీట్‌ అవుతుందంటున్నారు. మరోవైపు తుక్కుగూడ సభ తర్వాత కాంగ్రెస్‌ మరింత దూకుడుగా ముందుకెళ్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *