Bengal CM Mamata Banerjee suffered severe head injury : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు బలమైన గాయం.. ఆసుపత్రికి తరలింపు

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ X హ్యాండిల్ ద్వారాఈ సమాచారాన్ని ఇచ్చింది. గాయపడ్డ ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్చారు
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ X హ్యాండిల్ ద్వారాఈ సమాచారాన్ని ఇచ్చింది. మా చైర్పర్సన్ తీవ్రంగా గాయపడ్డారని టీఎంసీ పేర్కొంది. మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని పిలిపినిచ్చింది. ఇందుకు సంబంధించి సీఎం మమత బెనర్జీ చిత్రం కూడా బయటకు వచ్చింది, అందులో ఆమె నుదిటి నుంచి రక్తం వస్తున్నట్లు కనిపిస్తోంది. గాయపడ్డ ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకు చికిత్స కొనసాగుతోంది. అయితే సీఎం మమత బెనర్జీ ఇంట్లో వ్యాయమం చేస్తుండగా కిందపడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అభిషేక్ బెనర్జీ అమెను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2024లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడటం ఇది రెండోసారి. జనవరి నెలలో, బర్ధమాన్ జిల్లా నుండి తిరిగి వస్తుండగా అమె నుదిటిపై భాగంలో గాయమైంది. అప్పుడు ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. బర్ధమాన్ నుంచి తిరిగి వస్తుండగా, వర్షం వస్తోంది. దీంతో ఒక్కసారిగా సీఎం కారు డ్రైవర్ సడన్‌గా బ్రేకులు వేయాల్సి వచ్చింది. దీంతో మమతా తలకు గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొంది మమతా కోలుకున్నారు.