Astronauts returned from space

భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఆరు నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు.
కేప్ కెనావెరల్: భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఆరు నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో వీరు కిందకు దిగారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న నేవీ, నాసా సిబ్బంది ఈ క్యాప్సుల్‌ను వెలికితీసి, సురక్షితంగా నౌకపైకి చేర్చారు. అనంతరం అందులోని వ్యోమగాములు.. జాస్మిన్ మాగ్‌బెలి (అమెరికా), ఆండ్రియాస్ మోగెన్‌సెన్ (డెన్మార్క్), సతోషి ఫురుకవా (జపాన్), కాన్‌స్తాంటిన్ బొరిసోవ్ (రష్యా) వెలుపలికి వచ్చారు. వీరు గతేడాది ఆగస్టు 26న స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో రోదసిలోకి వెళ్లారు.