#Top Stories

Asteroid : A massive asteroid near-Earth Asteroid : డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

భూమికి దగ్గరగా ఈ రోజు ఒక భారీ గ్రహశకలం ప్రయాణించనుందని నాసా తెలిపింది. కుతుబ్‌మినార్‌కు డబుల్ సైజులో ఉన్న ఈ గ్రహశకలం భూమికి 4 మిలియన్‌ మైళ్ల దగ్గరగా ప్రయాణించనుందని అంచనా. దీనికి నాసా 2024 సీజే8 అని పేరు పెట్టింది. అమెరికాలోని నాసా జెట్ ప్రొపల్షన్‌ లెబొరేటరీ వివరాల ప్రకారం ఈ గ్రహశకలం 66 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తోంది.

భూమికి దగ్గరగా ఈ రోజు ఒక భారీ గ్రహశకలం ప్రయాణించనుందని నాసా తెలిపింది. కుతుబ్‌మినార్‌కు డబుల్ సైజులో ఉన్న ఈ గ్రహశకలం భూమికి 4 మిలియన్‌ మైళ్ల దగ్గరగా ప్రయాణించనుందని అంచనా. దీనికి నాసా 2024 సీజే8 అని పేరు పెట్టింది. అమెరికాలోని నాసా జెట్ ప్రొపల్షన్‌ లెబొరేటరీ వివరాల ప్రకారం ఈ గ్రహశకలం 66 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తోంది. దీని వేగం ఏకంగా గంటకు 43 వేల కిలోమీటర్లు. సాధారణంగా ఆస్టరాయిడ్‌ సైజు 140 మీటర్ల కంటే ఎక్కువగా ఉండి, భూమికి 46 లక్షల కిలోమీటర్ల లోపు దూరం నుంచి వెళ్లే అవకాశం ఉంటే దీన్ని ప్రమాదంగా పరిగణిస్తారు. ఇది మధ్యలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి దీన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. భూమికి ప్రమాదకరంగా పరిణమించే గ్రహశకలాలు కొన్ని సార్లు భూమిని ఢీకొట్టే అవకాశం కూడా ఉంటుంది. గ్రహశకలం సైజు, భూమి కక్ష్యకు, వాటికి మధ్య దూరాన్ని బట్టి ఇవి ప్రమాదకరమైనవో కాదో గుర్తిస్తారు. భూమిపై ఉండే టెలిస్కోపులు, రాడార్ వ్యవస్థల ద్వారా ఈ గ్రహశకలాలను పరిశీలిస్తూ ఉంటారు. 2024 సీజే8 గ్రహశకలం 2020లో ఒకసారి భూమికి దగ్గరగా వచ్చినట్లు నాసా పేర్కొంది. 2028 ఆగస్ట్‌ 29వ తేదీన మరోసారి భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. భూమికి అతి సమీపంలో 10,700 ఆస్టరాయిడ్లను నాసా ఇప్పటికే గుర్తించింది. .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *