Arunachal Pradesh belongs to India.. America is a strong counter to China.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దే.. చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్

అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూ భాగంగా తాము గుర్తించామని..వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది..
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూ భాగంగా తాము గుర్తించామని..వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.. బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. చైనా వ్యాఖ్యలు అర్ధరహితమని ఆగ్రహం వ్యక్తంచేశారు. US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ మాట్లాడుతూ.. “అరుణాచల్ ప్రదేశ్‌ను యునైటెడ్ స్టేట్స్ భారత భూభాగంగా గుర్తిస్తుంది.. వాస్తవ నియంత్రణ రేఖ అంతటా చొరబాట్లు లేదా ఆక్రమణలు, సైన్యం ద్వారా ఉద్రిక్త పరిస్థితులను ఏర్పరిచే ఏ ఏకపక్ష ప్రయత్నాలనైనా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము..” అంటూ పేర్కొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మొండిగా వ్యవహరిస్తూ వస్తున్న చైనా.. తన వక్రబుద్ధిని బయటపెట్టింది.. ఈ నెల9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించి సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. సొరంగ మార్గం ప్రారంభం తర్వాత చైనా అభ్యంతరం వ్యక్తంచేసింది. జాంగ్నాన్ తమదేనని, సేలా సొరంగాన్ని భారత్ చట్టవిరుద్ధంగా స్థాపించిందంటూ చైనా ఆరోపించింది.. అయితే దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఉత్తుత్తి పేర్లతో క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను మార్చలేరని.. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని తేల్చిచెప్పింది.
కాగా..అరుణాచల్ ప్రదేశ్‌లో భారత నేతల పర్యటనలపై చైనా నిరంతరం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేగాక చైనా.. గతేడాది అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను మార్చింది. గత ఐదేళ్లలో చైనా ఈ చర్యలకు పాల్పడటం ఇది మూడోసారి.. దీనిని ఎప్పటికప్పుడు భారత్ ఖండిస్తూనే ఉంది.. అటు అమెరికా కూడా అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమేనని పలుమార్లు నొక్కి చెప్పినా చైనా మొండి వైఖరి మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే చైనా వ్యాఖ్యలపై.. భారత్ తోపాటు.. అమెరికా కూడా స్పందించి డ్రాగన్ కంట్రీకి కౌంటర్ ఇచ్చాయి.
అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా సైన్యం “చైనా భూభాగంలో అంతర్లీన భాగం” అని పేర్కొన్న తర్వాత వాషింగ్టన్ దానిని భారత భూభాగంగా గుర్తిస్తోందని యుఎస్ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) అంతటా ప్రాదేశిక క్లెయిమ్‌లను ముందుకు తీసుకెళ్లడానికి చేసే ఏవైనా ప్రయత్నాలను యుఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అధికారి తెలిపారు.
“భారతదేశం అక్రమంగా స్థాపించిన అరుణాచల్ ప్రదేశ్‌ను బీజింగ్ ఎప్పుడూ గుర్తించదు, గట్టిగా వ్యతిరేకించదు” అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ చెప్పిన మూడు రోజుల తర్వాత US అధికారి ఈ ప్రకటన చేశారు.