Aravind Kejriwal: సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ హెల్త్ చెకప్ కోసం ఏడు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు జస్టిస్ ఏఎస్ ఓక్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.
ల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ హెల్త్ చెకప్ కోసం ఏడు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు జస్టిస్ ఏఎస్ ఓక్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అంతే కాదు, దరఖాస్తు ఆలస్యంగా దాఖలు చేయడంపై కూడా ధర్మాసనం ప్రశ్నలు సంధించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు, ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని సూచించింది. దాంతో.. మరో నాలుగు రోజుల్లో కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియనుంది. అయితే.. ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయన.. మరికొన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ల బృందం చెప్పినట్లు పిటిషన్లో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే.. మరో 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టును కోరారు కేజ్రీవాల్. అయితే కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓక్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.