#Top Stories

Ambani – Adani: చేతులు కలిపిన అంబానీ, అదానీ.! ఇరువురి కంపెనీల మధ్య కీలక ఒప్పందం.

భారతీయ టాప్ సంపన్నులు, వ్యాపారరంగంలో సూపర్‌ కాంపిటీటర్స్‌ ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు చేతులు కలిపారు. అవును వీరిద్దరూ వ్యాపార విషయమై ఒప్పందం కుదుర్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న అదానీ గ్రూప్ అనుబంధ కంపెనీ ‘మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌’లో 26 శాతం వాటా విద్యుత్ వినియోగానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌లో భాగంగా 500 మెగావాట్ల విద్యుత్‌ను రిలయన్స్ వాడుకోనుంది.

భారతీయ టాప్ సంపన్నులు, వ్యాపారరంగంలో సూపర్‌ కాంపిటీటర్స్‌ ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు చేతులు కలిపారు. అవును వీరిద్దరూ వ్యాపార విషయమై ఒప్పందం కుదుర్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న అదానీ గ్రూప్ అనుబంధ కంపెనీ ‘మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌’లో 26 శాతం వాటా విద్యుత్ వినియోగానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌లో భాగంగా 500 మెగావాట్ల విద్యుత్‌ను రిలయన్స్ వాడుకోనుంది. ఒప్పందంలో భాగంగా మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను రిలయన్స్ కొనుగోలు చేయనుంది. రూ. 50 కోట్లకు సమానమైన ముఖ విలువ రూ.10 కలిగిన షేర్లను కొనుగోలు చేయనున్నట్టు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో ఇరు కంపెనీలు వెల్లడించాయి. ఈ మేరకు అదానీ పవర్ లిమిటెడ్ (APL) అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ (MEL), రిలయన్స్ మధ్య 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరిందని వివరించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *