#Top Stories

Agnibaan: అగ్నిబాణ్‌ విజయవంతం

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 7.15 గంటలకు అగ్నిబాణ్‌ రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపారు.

శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 7.15 గంటలకు అగ్నిబాణ్‌ రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపారు. రెండు నిమిషాలపాటు సాగిన ఈ ప్రయోగం స్వదేశీ అంతరిక్ష సాంకేతికత అభివృద్ధిలో సాధించిన గొప్ప విజయం. ఇది ఒక ప్రధాన మైలురాయి అని పేర్కొంటూ చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థను.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అభినందించింది. వాస్తవంగా అగ్నిబాణ్‌ ప్రయోగం ఈ ఏడాది ఏప్రిల్‌ 7న చేపట్టాల్సి ఉండగా సాంకేతిక లోపంతో నాలుగుసార్లు వాయిదా పడింది. దీర్ఘవృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్‌ పొడవు 6.2 మీటర్లు. ఇందులో అధునాతన ఏవియానిక్స్‌ ఆర్కిటెక్చర్, ఆటోపైలట్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. అగ్నికుల్‌ కాస్మోస్‌కు చెందిన మొదటి వాహకనౌక ఒక పరీక్షా వాహకనౌకగా పనిచేయడం, అంతర్గత, స్వదేశీ సాంకేతికతలను ప్రదర్శించడం, కీలకమైన విమాన డేటాను సేకరించడం, సరైన పనితీరును నిర్ధారించడం దీని ముఖ్య ఉద్దేశాలు.

మైలురాళ్లివే..: ఇది సబ్‌ఆర్బిటల్‌ లాంచ్‌. ఈ వాహకనౌక 30 నుంచి 300 కిలోల వరకు పేలోడ్‌లను మోసుకెళ్లగలదు. ప్రైవేటు ప్రయోగవేదిక నుంచి భారతదేశానికి చెందిన మొదటి ప్రయోగం చేపట్టడం, దేశంలోనే మొట్టమొదటి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌ను నింగిలోకి పంపించడం, మొదటి సింగిల్‌ పీస్‌-3డీ ప్రింటెడ్‌ ఇంజిన్‌ను వినియోగించి, వాహకనౌకకు శక్తినిచ్చేలా దేశీయంగా నిర్మించడం వంటి మైలురాళ్లను అగ్నిబాణ్‌ సాధించింది.  

తక్కువ ఖర్చుతో..: సాధారణంగా రాకెట్‌ ఇంజిన్‌ భాగాలు విడిగా తయారు చేసి, తర్వాత అనుసంధానం చేస్తారు. 3డీ-ప్రింటెడ్‌ తయారీ ప్రక్రియను వినియోగించడంతో ప్రయోగం ఖర్చు, వాహన అనుసంధానం తగ్గుతుంది. ఇందులో ఉప శీతల ఆక్సిజన్‌ను ఇంధనంగా వినియోగిస్తారు.

Agnibaan: అగ్నిబాణ్‌ విజయవంతం

Air India Flight Delayed 24 Hours :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *