The girl child went home for the festival and died.-పండుగ కోసం ఆడబిడ్డ ఇంటికి వెళ్లి మృత్యువాత …

మెదక్ : అప్పటి వరకు కబుర్లు చెప్పుకుంటూ, బట్టలు ఉతుకుతూ ఉండేవారి పాలిట చెరువు యమకూపంగా మారింది. ముగ్గురు మహిళలు మృతి చెందగా బాలుడు అదృశ్యమయ్యాడు. మరో మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ విషాద సంఘటన మనోహరాబాద్ మండలం రంగాయపల్లి చెరువు వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రంగాయపల్లికి చెందిన ఫిరంగి చంద్రయ్య, లక్ష్మి దంపతులకు కుమార్తె లావణ్య(23), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగకు లక్ష్మి తన సోదరుల కుటుంబాలను ఆహ్వానించింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేటకు చెందిన దుడ్డు యాదగిరి, శ్రీకాంత్‌లు డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అక్క లక్ష్మి ఆహ్వానం మేరకు యాదగిరి భార్య బాలమణి (30), శ్రీకాంత్ భార్య లక్ష్మి (25), పిల్లలు పండుగకు వచ్చారు.

ఈ క్రమంలో లక్ష్మి కూడా ప్రాణాలు విడిచింది. లక్ష్మి చెరువులో  మునిగిపోతుండగా అటుగా వెళ్తున్న  యువకుడు  ఆమెను బయటకు తీయడంతో ఆమె ప్రాణాలను కాపాడాడు . విషయం తెలుసుకున్న గ్రామస్థులు చెరువులో బాలమణి, లక్ష్మి, లావణ్య మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని తూప్రాన్‌ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తూప్రాన్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి, డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్‌ నాగభూషణం, తదితరులు సందర్శించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించి, చరణ్ మృతదేహం కోసం పోలీసులు ఈతగాళ్లతో గాలిస్తున్నారు.
 చెరువులో జేసీబీ గుంతల వల్ల నలుగురు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడున్న వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. తాము లేరన్న వాస్తవాన్ని అంగీకరించలేక తమ గుండెలు పిండేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగ కోసం ఆడబిడ్డ ఇంటికి వెళ్లి మృత్యువాత పడడంతో  అంబర్‌పేట గ్రామస్తులు శోకసంద్రంలో మునిగి రంగాయపల్లి చెరువు వద్దకు వచ్చారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వన్నెరు ప్రతాప్ రెడ్డి పరిస్థితిని తెలుసుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని మాట ఇచ్చాడు.