#Telangan Politics #Telangana

The state government should convince the Cannes company : కేన్స్‌ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలి KTR

తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు.

హైదరాబాద్‌: తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘పెట్టుబడులు తెచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలమవుతోంది. కేన్స్‌ కంపెనీ గుజరాత్‌కు వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎంతో ప్రయత్నించి ఆ సంస్థ ఇక్కడ పెట్టుబడి పెట్టేలా ఒప్పించాం. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు 10 రోజుల్లోగా భూమి కేటాయించాం. కేన్స్‌ కంపెనీ వస్తే సెమీ కండక్టర్‌ రంగంలో ఎంతో పురోగతి ఉంటుంది. పెట్టుబడులు కొనసాగించేలా ఆ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలి’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *