#Telangan Politics #Telangana #Telangana News #Top Stories

TELANGANA : MP Pasunuri Dayakar joined Congress.. Aruri Ramesh joined BJP! బీఆర్ఎస్‌కి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్.. బీజేపీలోకి ఆరూరి రమేష్‌!

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు దెబ్బలమీద దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ బీఆర్‌ఎస్‌కి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి కొండా సురేఖ దయాకర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు దెబ్బలమీద దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ బీఆర్‌ఎస్‌కి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి కొండా సురేఖ దయాకర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా.. పసునూరి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న దయాకర్.. 2015 వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మరోసారి ఎంపీ సీటు తనకు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. సిటింగ్‌ ఎంపీనైన తనకు టికెట్‌ ఇవ్వకపోవడం బాధ కలిగించిందని అందుకే తాను పార్టీ మారుతున్నట్లు చెప్పారు పసునూరి దయాకర్ తెలిపారు. పార్టీలో చేరకుముందు రోజు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు పసునూరి దయాకర్.

ఇదిలా ఉంటే, వరంగల్‌ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్‌కు పంపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు లకు ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ విజ్ఞప్తి చేశారు.

కాగా, నాలుగు రోజుల క్రితం ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్డుకుని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు.

TELANGANA : MP Pasunuri Dayakar joined Congress.. Aruri Ramesh joined BJP! బీఆర్ఎస్‌కి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్.. బీజేపీలోకి ఆరూరి రమేష్‌!

SUDAN : Horrible hunger crisis in Sudan

TELANGANA : MP Pasunuri Dayakar joined Congress.. Aruri Ramesh joined BJP! బీఆర్ఎస్‌కి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్.. బీజేపీలోకి ఆరూరి రమేష్‌!

Octopus mock drill in front of Srivari

Leave a comment

Your email address will not be published. Required fields are marked *