#Telangan Politics #Telangana #Telangana News

Telangana congress: Konappa Joined Congress party కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప

 సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాగజ్‌ నగర్‌ పట్టణంలోని విన య్‌ గార్డెన్‌లో గురువా రం నిర్వహించిన సమా వేశంలో ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సీతక్క కండువా కప్పి కోనప్పను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కోనప్పతోపాటు ఆయన సోదరుడు, ఇన్‌చార్జ్‌ జెడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహీనా సుల్తానా, వైస్‌చైర్మన్‌ రాజేందర్, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదిలాబాద్‌ ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, సిర్పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రావి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *