#Telangan Politics #Telangana

Telangana Brs : Dramatic Evolution in Warangal Politics..వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం..

తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి.  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా రెండంకెల స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తుంటే బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక కీలక నేత బీఆర్ఎస్ ను వీడితే మరో ముఖ్య నేత మరోసారి చేరేందుకు సిద్దమయ్యారు. వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించారు తాటికొండ రాజయ్య. అయితే అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత నెలలో పార్టీకి రాజీనామా చేశారు. 2018లో స్టేషన్‌ ఘన్‌పూర్‌నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తాటికొండ రాజయ్యకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన కడియం శ్రీహరి విజయం సాధించారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరనుండడంతో.. తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

వరంగల్‌ బీఆర్‌ఎస్‌లో నాటకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ను వీడేందుకు సన్నాహాలు చేసుకుంటుంటే.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా ఉపసంహరణ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రాజయ్య సమాయత్తమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని రాజయ్య నివాసంలో ఈ మేరకు బీఆర్‌ఎస్‌ నేతలు సమావేశమయ్యారు. ఈ సాయంత్రం కేసీఆర్‌తో భేటీకానున్నారు తాటికొండ రాజయ్య. ఏఏ అంశాలు చర్చించనున్నరన్న అసక్తి రాజకీయ వర్గాల్లో మొదలైంది. అలాగే తన చిరకాల ప్రత్యర్థి కడియంపై పోటీకి సిద్ధమంటున్నారు తాటికొండ రాజయ్య ఒక వేళ కడియం స్థానంలో రాజయ్యకు టికెట్ బీఆర్ఎస్ ఇస్తుందా లేదా అన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *