Telangana: Balka suman Balka Suman’s letter to CM Revanth Reddy.. సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ లేఖ.. టెట్ అభ్యర్థుల కోసం..

అలాగే కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్ పరీక్ష ఉంటుందని ప్రకటించడంపై కూడా బాల్క సుమన్ లేఖలో ప్రస్తావించారు. 11 జిల్లా కేంద్రాల్లోనే కాకుండా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని ఆ లేఖలో తెలిపారు. 11 జిల్లాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తే మిగతా జిల్లాల విద్యార్థులు ఇబ్బందులు పడతారని తెలిపారు. వారికి దూరభారంతో పాటు ఆర్థికభారం కూడా అవుతుందన్నారు…
బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగా లేఖ రాశారు. టెట్ పరీక్ష ఫీజుకు సంబంధించిన ఈ లేఖలో ప్రస్తావించారు. పరీక్ష ఫీజు భారాన్ని తగ్గించాలని కోరారు. గతంలో టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్‌కి రూ. 200, రెండు పేపర్లకు రూ. 300 ఉండేదని.. కానీ ఇప్పుడు ఒక పేపర్‌కి రూ. 1000, రెండు పేపర్లకు రూ. 2000 పెంచడం వల్ల అభ్యర్థులపై భారం పడుతుందని సుమన్ లేఖలో పేర్కొన్నారు.
అలాగే కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్ పరీక్ష ఉంటుందని ప్రకటించడంపై కూడా బాల్క సుమన్ లేఖలో ప్రస్తావించారు. 11 జిల్లా కేంద్రాల్లోనే కాకుండా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని ఆ లేఖలో తెలిపారు. 11 జిల్లాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తే మిగతా జిల్లాల విద్యార్థులు ఇబ్బందులు పడతారని తెలిపారు. వారికి దూరభారంతో పాటు ఆర్థికభారం కూడా అవుతుందన్నారు. కాబట్టి 7 లక్షల మంది నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకొని ఫీజులు తగ్గించాలని, పరీక్ష కేంద్రాలను 33 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదిలా ఉంటే టెట్ పరీక్షకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తాఉ. మే 15వ తేదీ నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.