#Telangan Politics #Telangana #Telangana News

‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలే లక్ష్యంగా, మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటుకు రూ. 4.07 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారం ఉండనుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చించనున్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్‌లైన్‌లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటం. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహాయంతో రైతులకు పలు సూచనలు చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *