#Telangan Politics #Telangana

Raghunandan Rao: భారాస ఖాతాను వెంటనే ఫ్రీజ్‌ చేయాలి: భాజపా నేత రఘునందన్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారాసపై భాజపా మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు.

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారాసపై భాజపా మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు. ఈ ఎన్నికల్లో రూ.30కోట్లతో ఓట్ల కొనుగోలుకు ఆ పార్టీ తెరలేపిందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖలు రాశారు.

ఓ బ్యాంక్‌లోని భారాస అధికారిక ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇన్‌ఛార్జులకు నగదు బదిలీ జరిగినట్లు రఘునందన్‌ ఆరోపించారు. బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని.. లేకుంటే కోట్లాది రూపాయలను ఓట్ల కొనుగోలుకు ఉపయోగిస్తారన్నారు. భారాస ఖాతాను వెంటనే ఫ్రీజ్‌ చేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *