#Telangan Politics #Telangana #Telangana News

Radhakrishnan will take charge as the new Governor of Telangana : తెలంగాణ నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్‌

తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు

హైదరాబాద్‌: తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళిసై సౌందర రాజన్‌ రాజీనామాతో ఝార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్ర బాధ్యతలు అదనంగా అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. రాత్రి 9.10 గంటలకు రాంచీ నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. నూతన గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. బుధవారం ఉదయం 11.15 గంటలకు రాధాకృష్ణన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్‌భవన్‌ వేదికగా కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణం చేయించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *