Provide Water For the drying crops ఎండిపోతున్న పంటలకు నీళ్లివ్వండి Harish Rao

ఎండిపోతున్న పంటలను రైతులు కాపాడుకునేందుకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.
ద్దిపేట, న్యూస్‌టుడే: ఎండిపోతున్న పంటలను రైతులు కాపాడుకునేందుకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. హరీశ్‌రావు సిద్దిపేటలో ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో యాసంగి పంటలు చేతికొచ్చేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ‘‘గత నాలుగేళ్లలో భారాస ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం సరిపడా సాగునీటిని అందుబాటులో ఉంచింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. కర్షకులు కొత్త బోర్లు వేయిస్తూ అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయ బావుల్లో పూడికతీత పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ దుస్థితిని అధిగమించాలంటే వెంటనే రంగనాయసాగర్ రిజర్వాయర్‌లోకి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలి. మల్లన్నసాగర్‌కూ విడుదల చేయాలి.. అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్‌లోనూ ఒక టీఎంసీ మేర నిల్వ ఉంచాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించి.. రాజకీయాలు కాకుండా రైతుల ప్రయోజనాలపై దృష్టి సారించాలి. తగిన పరిష్కారం చూపకపోతే పోరాటాలకు సైతం సిద్ధమవుతాం’’ అని పేర్కొన్నారు.