#Telangan Politics #Telangana

PM Modi: Prime Minister Modi’s Vijaya Sankalpa Sabha IN Jagityal..జగిత్యాల వేదికగా ప్రధాని మోదీ విజయ సంకల్ప సభ.. ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారంటే..

లోకసభ ఎన్నికలకు నగారా మోగింది.. మే 13న తెలంగాణలో లోక్ సభ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణలోని 17 సీట్లలో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణ డబుల్ డిజిట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆదిలాబాద్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు వేదికగా లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించిన ప్రధాని మోదీ..

లోకసభ ఎన్నికలకు నగారా మోగింది.. మే 13న తెలంగాణలో లోక్ సభ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణలోని 17 సీట్లలో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణ డబుల్ డిజిట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆదిలాబాద్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు వేదికగా లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించిన ప్రధాని మోదీ.. తాజాగా జగిత్యాల వేదికగా జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రసంగించారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లిలో పోటీచేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సారి 400 సీట్లు గ్యారెంటి అంటూ పేర్కొన్న మోదీ.. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు.

కాగా, కరీంనగర్, నిజామాబాద్‌ సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకునేలా జగిత్యాల వేదికగా బీజేపీ విజయసంకల్ప సభను ప్లాన్ చేసింది. జగిత్యాల జిల్లాను పూర్వ కరీంనగర్ జిల్లా నుంచి విభజించారు. ఈ జిల్లా చుట్టూ నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. దీంతో ఈ సారి రెండు సిట్టింగ్ స్థానాలతోపాటు.. మరో స్థానం పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేలా జగిత్యాల జిల్లా కేంద్రంలో సభను నిర్వహించారు. కరీంనగర్‌లో బండి సంజయ్, నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ మళ్లీ ఎంపీ అభ్యర్థులుగా పోటీచేస్తుండగా.. పెద్దపల్లిలో ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్‌ బరిలో ఉన్నారు.

జగిత్యాల ప్రాంతం విశిష్టత ఇదే..

జగిత్యాల ప్రాంతం ప్రాచీనకాలం నాటినుంచి ప్రాముఖ్యత కలిగిఉంది.. శాతవాహనుల తొలి రాజధాని, జగ్గదేవుడు పేరు మీద జగిత్యాల పేరు వచ్చింది. జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అత్యంత ప్రాచుర్యం పొందింది.. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు గల్ఫ్ దేశాలకు, బొంబాయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తారు. అక్కడ కూలీ పనులు చేసి కుటుంబాలను పోషిస్తుంటారు. ఈ జిల్లాలో సుమారు 10 లక్షల మంది జనాభా ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *