MLC Kavitha: దిల్లీ లిక్కర్ కేసులో నేనూ బాధితురాలినే: ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు
హైదరాబాద్: దిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆ కేసులో తానూ బాధితురాలినేనని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటానన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని.. ఆదర్శ్ స్కామ్‌లో ప్రమేయం ఉన్న అశోక్ చవాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చారని భాజపాను ఉద్దేశించి విమర్శించారు. ఆయన్ను సీఎం అభ్యర్థిగానూ ప్రకటిస్తారేమోనని కవిత వ్యాఖ్యానించారు.