Minister Konda Surekha : will respond promptly to notices : కేటీఆర్ నోటీసులకు దీటుగా బదులిస్తా..: మంత్రి కొండా సురేఖ

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులకు దీటుగా సమాధానమిస్తానని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

హైదరాబాద్: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులకు దీటుగా సమాధానమిస్తానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తుక్కుగూడ సభా ప్రాంగణం వద్ద గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను కేటీఆర్ పరువుకు భంగం కలిగేలా మాట్లాడానంటూ ఆయన నోటీసులిచ్చారని పేర్కొన్నారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని ఆయన అందులో డిమాండ్ చేశారని.. తాను మాత్రం క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దుర్భాషలాడుతున్న కేటీఆరే క్షమాపణ చెప్పాలని సురేఖ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సొమ్ము తిన్నది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు.