LS Polls Invitation From KCR : కేసీఆర్ నుంచి రాజయ్యకు పిలుపు.. వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే చాలా చోట్ల అభ్యర్థులను ఫిక్స్ చేసినప్పటికీ కీలక స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పార్టీలు వ్యూహత్మంగా అడుగులు వేస్తూ అసంత్రుప్తి లేకుండా వ్యూహ రచన చేస్తున్నాయి.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే చాలా చోట్ల అభ్యర్థులను ఫిక్స్ చేసినప్పటికీ కీలక స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పార్టీలు వ్యూహత్మంగా అడుగులు వేస్తూ అసంత్రుప్తి లేకుండా వ్యూహ రచన చేస్తున్నాయి. అయితే తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఇతర పార్టీల కంటే ముందుగానే లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే వరంగల్ బరిలో స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యాకు టికెట్ ఇవ్వగా చివరి టైంలో ఆమె కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే కేసీఆర్ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యను ప్రకటించే అవకాశాలున్నాయి.
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతున్నాయి. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వరంగల్ లోకసభ సీటును ఆశించిన రాజయ్య పార్టీ నాయకత్వం స్పందించకపోవడమే ఆ నిర్ణయానికి కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా కడియం కావ్యా కాంగ్రెస్ లోకి వెళ్లడంతో మళ్లీ రాజయ్య రేసులోకి వచ్చారు.