#Telangan Politics #Telangana

KTR : Two MLAs who joined Congress should resign: కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్‌

ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్‌ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు.

హైదరాబాద్‌: ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్‌ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపులపై మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని తెలిపారు. 

‘‘పదో షెడ్యూల్‌ చట్ట సవరణ స్వాగతించదగినది. కానీ కాంగ్రెస్‌ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా వారి విధానాలు ఉంటాయి. ఇద్దరు భారాస ఎమ్మెల్యేలను ఆ పార్టీ చేర్చుకుంది. అందులో ఒక ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. హామీలపై నిబద్ధత ఉంటే ఈ అంశంపై రాహుల్‌ గాంధీ మాట్లాడాలి. వారి పార్టీలో చేరిన ఇద్దరితో రాజీనామా చేయించాలి. అనర్హులని స్పీకర్‌ ప్రకటించాలి. చెప్పిందే చేస్తాం.. అబద్ధాలు చెప్పబోమని కాంగ్రెస్‌ నిరూపించుకోవాలి’’ అని కేటీఆర్‌ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *