#Telangan Politics #Telangana

KTR sent legal notices to Minister Konda Surekha. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్..

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అయితే మొదట్లో అధికారులకే పరిమితమైన కేసులో రాజకీయ నాయకుల ప్రాత ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అయితే మొదట్లో అధికారులకే పరిమితమైన కేసులో రాజకీయ నాయకుల ప్రాత ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ…అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు.

ట్యాపింగ్ అంశంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా. పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపించారు. వీరితో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసిన మరికొన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్ లకు మరోసారి నోటీసులు పంపించారు.

తనకు సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేదే లేదని తేల్చిచెబుతూ.. వారం రోజుల్లోగా మంత్రి కొండా సురేఖ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అయితే కేటీఆర్ లీగల్ నోటీసులపై కాంగ్రెస్ ఏవిధంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారనుంది.

KTR sent legal notices to Minister Konda Surekha. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్..

Harish Rao : Selfish people are changing

Leave a comment

Your email address will not be published. Required fields are marked *