#Telangan Politics #Telangana

KTR : కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను “వంచన” అని పేర్కొన్నారు : కేటిఆర్.

కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను “వంచన” అని పేర్కొన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్‌ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపులపై మాజీ మంత్రిపై మండిపడ్డారు.

కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను “వంచన” అని పేర్కొన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్‌ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపులపై మాజీ మంత్రిపై మండిపడ్డారు. ‘న్యాయ్ పత్ర్’ పేరుతో, కాంగ్రెస్ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం తన మ్యానిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. అందులో ఫిరాయింపులకు స్వస్తిపలుకుతూ కొత్త చట్టాలు చేస్తామని చెబుతూనే ఫిరాయింపులకు పాల్పడిందని ఎద్దేవా చేశారు. ఇటీవలి కాలంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయింపులకు పాల్పడుతూ కపటత్వాన్ని చూపిస్తున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ న్యాయ్ పత్ర్ అనే మేనిఫెస్టో విడుదలకు మూడు వారాల ముందు తెలంగాణకు చెందిన ఇద్దరు శాసనసభ సభ్యులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియన్‌ శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య మార్చి 30న కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కావ్యకు బీఆర్‌ఎస్ ఎంపీ టికెట్ కేటాయించిన కొద్ది రోజులకే పార్టీ మారాలనుకోవడాన్ని కేటీఆర్ విమర్శించారు.

“అవకాశవాద రాజకీయాలను శ్రీహరి కంటే ముందు దానం నాగేందర్ ప్రోత్సహించారన్నారు. దీనికి నిదర్శనంగా వారు కాంగ్రెస్‌లోకి మారారని కేటీఆర్ ఎత్తి చూపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు బీఆర్‌ఎస్ ఎంపీలు చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, పెద్దపల్లెకు చెందిన వెంకటేష్ నేత, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఎన్నికల కమిషన్‌కు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని లేఖలో అందజేసినప్పటికీ ఎలాంటి చర్యలు లేవన్నారు. ఇలాంటి వాటిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపుల పరంపర ప్రారంభమైందని తెలిపారు. మరో ఇద్దరు బీఆర్‌ఎస్ ఎంపీలు కూడా బీజేపీలో చేరారని ఈ సందర్భంగా తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *