#Telangan Politics #Telangana

TCongress: 30 MLAs are in touch..TCongress లోక్ సభ ఎన్నికల వేళ ఉత్కంఠభరిత రాజకీయం.. కారు పార్టీని ఖాళీ చేస్తున్న కాంగ్రెస్, కాషాయం..

లోక్ సభ ఎన్నికల ముంగిట ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీల్లోకి జంప్ అవుతున్నారు.

లోక్ సభ ఎన్నికల ముంగిట ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని, ఏ క్షణంలోనైనా పార్టీ మారే అవకాశం ఉందన్నారు. లోక్ సభ పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందని, బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు.

అధికారం లేకుండా కేసీఆర్ కుటుంబం మనుగడ సాగించలేకపోతోందని కోమటిరెడ్డి అన్నారు. గత దశాబ్ద కాలంలో కేసీఆర్ చేసిన అవినీతిని వెలికి తీయడానికి ప్రస్తుత ప్రభుత్వానికి 20 ఏళ్లు పట్టొచ్చని ఆయన అన్నారు. తన కుటుంబం ఎంపీ టికెట్ కోసం లాబీయింగ్ చేయలేదని, తన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *