KCR: KCR announced those two Lok Sabha seats.ఆ రెండు లోక్‌సభ స్థానాలను ప్రకటించిన కేసీఆర్.. నాగర్ కర్నూల్ బరిలో ఆర్ఎస్ ప్రవీణ్!

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మెదక్ నేతలతో సమావేశమయ్యారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు గులాబీ అధినేత మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ లోక్‌సభ స్థానానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 13 స్థానాలకు బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మెదక్ నేతలతో సమావేశమయ్యారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు గులాబీ అధినేత మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ లోక్‌సభ స్థానానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 13 స్థానాలకు బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక.. అంతకుముందు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థిత్వంపై ఆయా నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు.
కాగా ఖమ్మంకు నామా నాగేశ్వరరావు, కరీంనగర్ కు వినోద్ కుమార్, మహబూబాబాద్ కు మాలోత్ కవిత, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లతో బీఆర్ఎస్ తన తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 4, కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకున్నాయి. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ఏకైక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. సిట్టింగ్స్ చేజారిన ఆ స్థానాలను తమ ఖాతాలో వేసుకొని ఫిక్స్ అయ్యింది.