#Telangan Politics #Telangana

KCR Comments on Congress Government : అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ నేతలు

కాంగ్రెస్‌ నేతలు అంబేద్కర్‌ను అవమానించారని, నేను కట్టించానని అంబేద్కర్‌ విగ్రహం దగ్గరికి కాంగ్రెస్‌ నేతలు వెళ్లలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అంబేద్కర్‌ విగ్రహం పెట్టాక తొలి జయంతి ఇది అని, అంబేద్కర్‌ను అవమానించిన పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటల్లో భయం..

కాంగ్రెస్‌ నేతలు అంబేద్కర్‌ను అవమానించారని, నేను కట్టించానని అంబేద్కర్‌ విగ్రహం దగ్గరికి కాంగ్రెస్‌ నేతలు వెళ్లలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అంబేద్కర్‌ విగ్రహం పెట్టాక తొలి జయంతి ఇది అని, అంబేద్కర్‌ను అవమానించిన పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోందని, కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. రేవంత్‌కు ఇంటెలిజెన్స్‌ రిపోర్టు కూడా వచ్చిందని, ఏడాది కూడా ఈ సర్కార్‌ ఉండేలా కనిపించట్లేదని వ్యాఖ్యానించారు.

జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి రెండు కంటే ఎక్కువ సీట్లు రావని, సర్వే రిపోర్ట్‌లు చూసి రేవంత్‌ భయపడుతున్నారు..త్వరలో బీజేపీలో చేరతారన్నారు కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్‌ నేతల్లో కూడా భయం నెలకొందని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *