#Telangan Politics #Telangana #Top Stories

Kavitha Arrest Delhi liquor Policy Case:: ఆ యాక్ట్ ప్రకారమే కవిత అరెస్ట్..!

కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది? విచారిస్తారా? కోర్టులో ప్రవేశపెడతారా? కవితపై అప్లై చేసిన సెక్షన్లు ఏంటి? ఆర్థిక నేరాల కేసులు పెడితే బెయిల్ రావడం అంతా ఈజీ కాదా? అసలు ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. PMLA యాక్ట్-19ను అనుసరించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ED ఆఫీస్‌కు కవిత అర్ధరాత్రి 12.20 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది? విచారిస్తారా? కోర్టులో ప్రవేశపెడతారా? కవితపై అప్లై చేసిన సెక్షన్లు ఏంటి? ఆర్థిక నేరాల కేసులు పెడితే బెయిల్ రావడం అంతా ఈజీ కాదా? అసలు ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. PMLA యాక్ట్-19ను అనుసరించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ED ఆఫీస్‌కు కవిత అర్ధరాత్రి 12.20 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రంత్రా ఈడీ అఫీసులో ఉన్నారు కవిత. ఇవాళ ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేస్తారు. మధ్యాహ్నం వరకు విచారించి తర్వాత రౌస్‌అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు ఈడీ అధికారులు. అయితే.. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన అమిత్ అరోరాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా అమిత్ అరోరా ఇచ్చిన సమాచారంతోనే కవితను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరాను విచారిస్తుండగా.. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని ఈడీకి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ఢిల్లీ లిక్కర్స్ స్కాం కేసులో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. దీంతో.. ఇవాళ ఉదయం అమిత్ అరోరాతో కలిపి మరోసారి కవితను విచారించనున్నారు. మధ్యాహ్నం తర్వాత కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. తర్వాత కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తరలించడంతో ఈడీ ఆఫీసు దగ్గర 144 సెక్షన్‌ విధించారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమె భర్త, ఆమె తరపు లాయర్.. అక్కడే పడిగాపులు కాసారు. కవిత అరెస్ట్‌తో ఢిల్లీ ఈడీ ఆఫీస్‌ దగ్గర భారీగా పోలీసు బలగాల మోహరించారు.

అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్‌ వేయనున్నారు. అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్‌ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్‌ను చాలెంజ్ చేయనున్నారు కవిత. చట్ట విరుద్దంగా ఈడీ వ్యవహరించిందని కోర్టుకు తెలుపుతామన్నారు. న్యాయవ్యాదులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే మాదిరి కోర్టులపై తమకు నమ్మకం ఉంది. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని తెలిపారు కవిత లాయర్. ఇటువంటి కేసుల్లో, మానీలాండరింగ్ కేసులో బెయిల్ అంత ఈజీగా రాదని.. మాజీ జేడీ, వివి. లక్ష్మినారాయణ.

అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలక పాత్ర పోషించారని.. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో సంబంధమున్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కవితకు సంబంధించి విషయాలను బయటపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే.. కవిత పీఏతో పాటు పలువురు కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి.. సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. వాళ్లు ఇచ్చిన ఆధారంగానే.. ఛార్జ్ షీట్లు నమోదు చేయగా.. అందులో కవిత పేరును అధికారులు చేర్చారు. అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవాళ కవిత విషయంలో ఎలాంటి పరిణామాలు జరగుతాయోనన్న ఆసక్తి నెలకొంది.

Kavitha Arrest Delhi liquor Policy Case:: ఆ యాక్ట్ ప్రకారమే కవిత అరెస్ట్..!

SAMANTH UPADTES : I trembled with fear

Leave a comment

Your email address will not be published. Required fields are marked *