Inauguration Of Telangana Royal Seal Postponed..తెలంగాణ రాజముద్ర అవిష్కరణ వాయిదా..

తెలంగాణ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. జూన్ 2న ఆవిష్కరించాల్సిన ఈ లోగోను వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి సీఎంవో వర్గాలు. కొత్త చిహ్నంపై ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని అందుకే దీనిని వాయిదా వేస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది. జూన్ 2న జయ జయయే తెలంగాణ అనే గేయం మాత్రమే ఆవిష్కరణ చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంతోపాటు తెలంగాణ తల్లి మార్పు పై ఇంకా పలువురితో ప్రభుత్వం సంప్రదింపులు, చర్చలు జరుపనున్నట్లు సమాచారం.
తెలంగాణ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. జూన్ 2న ఆవిష్కరించాల్సిన ఈ లోగోను వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి సీఎంవో వర్గాలు. కొత్త చిహ్నంపై ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని అందుకే దీనిని వాయిదా వేస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది. జూన్ 2న జయ జయయే తెలంగాణ అనే గేయం మాత్రమే ఆవిష్కరణ చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంతోపాటు తెలంగాణ తల్లి మార్పు పై ఇంకా పలువురితో ప్రభుత్వం సంప్రదింపులు, చర్చలు జరుపనున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో అందరి ఆమోదం పొందిన తరువాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఏర్పాటై దాదాపు దశాబ్ధం గడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జూన్ 2న జరిగే దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు తగిన ఏర్పాట్లను కూడా సీఎస్ శాంత కుమారి పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతోంది. అందులో చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ను, కాకతీయుల కళా వైభవాన్ని గుర్తు చేసే శిలాతోరణాన్ని తొలగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
మిత్రపక్షాలతో ఈరోజు సీఎం రేవంత్ కీలక సమావేశం కానున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేవలం వామపక్షాలు, ఎంఐఎంను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భేటీకి బీఆర్ఎస్, బీజేపీని ఆహ్వానించకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాజముద్రను ఇవాళ ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర చిహ్నంపై ఇప్పటికే చిత్రకారుడు రుద్ర రాజేశం 50 నమూనాలు సీఎం రేవంత్ రెడ్డికి చూపించారు. అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా లోగో ఉండే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటివరకున్న అధికారిక చిహ్నంలో మార్పులుచేర్పులు చేయిస్తుంది కాంగ్రెస్ సర్కార్. రాచరికపు ఆనవాళ్లు ఉండొద్దని ఆదేశించడంతో.. పలు నమునాలను ప్రభుత్వం ముందుంచారు చిత్రకారుడు రుద్ర రాజేశం. అయితే, ఈ నమూనాల్లో కాకతీయ తోరణం సహా ఇతర చిత్రాలు లేకపోవడంపై రచ్చ నడుస్తోంది. మరోవైపు, రాష్ట్ర గీతాన్ని ఆంధ్రాకు చెందిన కీరవాణితో కంపోజ్ చేయించడంపైనా రగడ జరుగుతోంది.